Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

గుంటూరు, తెనాలిలో మద్యం దుకాణాలు బంద్.. అక్టోబర్ 30 నుంచి ఆంక్షలు

0
WhatsApp Image 2026-10-26 at 12.30.08 PM

గుంటూరు, అక్టోబర్ 26: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుంటూరు నగర పాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘం పరిధిలో మద్యం విక్రయాలను నిలిపివేయనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.యం. సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాల్లో విక్రయాలు నిలిపివేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.

గుంటూరు నగర పాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘం పరిధిలో నవంబర్ 1వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సంబంధిత నగర పాలక సంస్థ, పురపాలక చట్టాల్లోని నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలపై ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపారు.

అలాగే నవంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నందున, కౌంటింగ్‌కు ముందు 48 గంటల వ్యవధిలోనూ మద్యం విక్రయాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ఈ నిబంధనలను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో మద్యం విక్రయాలపై విధించిన ఆంక్షలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపే దుకాణాలపై ఎన్నికల నిబంధనలు, సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సంబంధిత ప్రాంతాల్లో మద్యం దుకాణాల నిర్వాహకులు అధికారుల ఆదేశాలను పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

#GunturNews #TenaliNews #LiquorBan #GunturElections #TenaliElections #LocalBodyElections #SaiKanthVarma #GunturCollector #APNews #AndhraPradesh #TeluguNews #GEETV

Leave a Reply