Flash News

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురాసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

vlcsnap-2026-11-05-16h13m45s448 పెద్దకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

0
mangalagiri

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకన అవకతవకల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని హాయ్‌ల్యాండ్ రిసార్ట్‌లో ఈడీ అధికారులు ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం హాయ్‌ల్యాండ్ ప్రాంగణంలో తనిఖీలు చేపట్టి, ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం.

గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఏపీపీఎస్సీ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచాల్సిన అసలు జవాబు పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా హాయ్‌ల్యాండ్ రిసార్ట్‌కు తరలించి, దాదాపు 84 రోజుల పాటు అక్కడే ఉంచినట్లు గతంలో సిట్ విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

అంతేకాకుండా, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించాల్సిన ప్రక్రియలో ప్రైవేట్ వ్యక్తులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఉపయోగించి మార్కులను ఓఎంఆర్ షీట్లలోకి మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రక్రియ కోసం ఒక ప్రైవేట్ సంస్థకు టెండర్లు లేకుండానే కోటికి పైగా నిధులు చెల్లించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టింది. విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోంది. చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌తో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

గ్రూప్-1 పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్న అక్రమాల వెనుక ఆర్థిక లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల పాత్రపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తాజా సోదాలతో ఈ వ్యవహారంలో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వస్తాయా? దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభిస్తాయి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#EDRaids #HiLand #APPSCGroup1 #Group1Scam #Chinakakani #Mangalagiri #GunturNews #EDInvestigation #AndhraPradeshNews #GEETVNews

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply