Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

బంగాళాఖాతంలో ‘అర్నబ్’ తుపాను.. ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక!

0
WhatsApp Image 2026-10-26 at 6.28.20 PM

డా. పచ్చవ గౌతమి
జీటీవి సీఈఓ

రేపు, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు.. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను క్రమంగా ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరువవుతోంది. తుపాను ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

అక్టోబర్ 26 సాయంత్రం 5.15 గంటలకు విడుదల చేసిన సమాచారం ప్రకారం, తుపాను గత ఆరు గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదిలింది. విశాఖపట్నానికి 540 కిలోమీటర్లు, కాకినాడకు 620 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 720 కిలోమీటర్లు, బాపట్లకు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు.

తుపాను తీరానికి చేరువయ్యే కొద్దీ దాని ప్రభావం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు మినహా రేపు, ఎల్లుండి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు వాతావరణ శాఖ, అధికార యంత్రాంగం జారీ చేసే తాజా హెచ్చరికలను పాటించాలని కోరారు.

తీర ప్రాంత ప్రజలు ప్రత్యేక అప్రమత్తతతో ఉండాలని, అధికారుల సూచనలకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

#CycloneArnab #CycloneAlert #APWeather #HeavyRainAlert #APSDMA #AndhraPradesh #WeatherUpdate #TeluguNews #GEETVNews

Leave a Reply