Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

0
9

GEETV, గుంటూరు:‘మురుసు’ తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రహదారులపై చెట్లు కూలిపోవడంతో జిల్లా పోలీసులు తక్షణమే స్పందించారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. రహదారులపై పడిపోయిన చెట్లను తొలగిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.

గుంటూరు–పర్చూరు రహదారిలోని పెదనందిపాడు వద్ద చెట్లు కూలి రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో పోలీసులు వెంటనే స్పందించి వాటిని తొలగించారు. అదేవిధంగా గుంటూరు–అమరావతి రహదారిలో తాడికొండ అడ్డరోడ్డు వద్ద కూలిన చెట్లను తాడికొండ పోలీసులు తొలగించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.

మరోవైపు ప్రత్తిపాడు చప్టా, లాం చప్టా ప్రాంతాల్లో పోలీసులు వాహనదారులకు తుఫాను ప్రభావంపై అవగాహన కల్పిస్తున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ప్రయాణించాలని సూచిస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటోంది. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీటితో నిండిన రహదారులు, చెట్లు కూలే ప్రమాదం ఉన్న ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

#మురుసుతుఫాను #గుంటూరుపోలీసులు #గుంటూరుజిల్లా #తుఫానుప్రభావం #పెదనందిపాడు #తాడికొండ #APPolice #GunturNews #CycloneAlert #GEETVNews

Leave a Reply