Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

0
123

ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో పెదనందిపాడుకు చేరిక

ముంపు గ్రామాల్లో పరిస్థితుల పరిశీలన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

23 గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరణకు ఆదేశాలు.. డ్రోన్లతో పంట, వరద నష్టం అంచనా

V.K. PALADUGU | REPORTER | GEETV

GEETV, పెదనందిపాడు / గుంటూరు, నవంబరు 4: మురసు తుఫాను ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వరద ముంపు పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. వరద ప్రవాహం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో పెదనందిపాడు ప్రాంతానికి చేరుకున్న కలెక్టర్, వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి ప్రజల ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. పెదనందిపాడు, కాకుమాను, ప్రత్తిపాడు మండలాల్లో పరిస్థితులను అంచనా వేసి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా నల్లమడ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరద పరిస్థితులను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. వాగుల వద్దకు ప్రజలు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవసరమైన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రవాహం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. అవసరమైతే బాధిత గ్రామాల్లో స్థానికంగానే ఆహార ఏర్పాట్లు చేయాలని సూచించారు.

విద్యుత్ పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి

తుఫాను, వరదల కారణంగా జిల్లాలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంపై కలెక్టర్ ఆరా తీశారు. ఇప్పటివరకు 23 గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరించాల్సి ఉందని, ఆయా ప్రాంతాల్లో పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ అధికారులు వాగుల ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. వరద ముంపు, తుఫాను ప్రభావంతో జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసేందుకు డ్రోన్ల ద్వారా కూడా పరిశీలన చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా జిల్లాలోని రహదారులు, వాగుల ఆధునీకరణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలగకుండా చర్యలు

మరోవైపు గురువారం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. కాకుమాను, ఫిరంగిపురం, పెదనందిపాడు మండలాల్లో ఎన్నికల సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారుల పరిస్థితిని ముందుగానే పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలని, గురువారం సాయంత్రం వరకు ఆయా బృందాలను స్థానికంగా అందుబాటులో ఉంచాలని సూచించారు.

జిల్లాలో మొత్తం 13 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయని, 13 జెడ్పీటీసీ, 200 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. వీటిలో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 193 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

తుఫాను ఒకవైపు.. వరద ముప్పు మరోవైపు.. ఎన్నికల నిర్వహణ ఇంకోవైపు.. ఇలా మూడు కీలక సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సహాయక చర్యలు, విద్యుత్ పునరుద్ధరణ, ఎన్నికల ఏర్పాట్లను సమాంతరంగా కొనసాగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె. శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి జి. శ్రీనివాస్, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటరత్నం తదితర అధికారులు పాల్గొన్నారు

#MurasuCyclone #Peddanandipadu #GunturCollector #GunturDistrict #FloodAffectedAreas #CropDamage #FarmersIssues #FarmersSupport #CycloneEffect #HeavyRains #FloodInspection #FieldVisit #APNews #AndhraPradeshNews #TeluguNews #BreakingNews #GEETVNEWS #GEETV

Leave a Reply