ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ
GEETV, గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.యం. సాయికాంత్ వర్మ తనిఖీ చేశారు. కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి లెక్కింపు జరుగుతున్న తీరును, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, లెక్కింపులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌కు వివరించారు. లెక్కింపు పురోగతి, చేపట్టిన ఏర్పాట్లపై సమాచారం అందజేశారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
#Guntur #GunturMunicipalCorporation #VoteCounting #ANU #CMSaikantVarma #GunturCollector #MayurAshok #ElectionCounting #APNews #GunturNews #AndhraPradesh #GEETV #GEETVNews