Flash News

WhatsApp Image 2026-11-05 at 9.58.09 PM చెన్నై వివాహ వేడుకలో వైఎస్ జగన్ దంపతులు.. శ్రేయ–ఉజ్వల్‌లకు ఆశీర్వాదం

WhatsApp Image 2026-11-05 at 9.20.25 PM తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. ఏపీలోనే విచారణ

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

గుంటూరు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: కోవెలమూడి లక్ష్మీ అపర్ణ

0
WhatsApp Image 2026-10-26 at 6.05.10 PM (1)

గుంటూరు: నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ స్పష్టం చేశారు. గుంటూరు నగర ఎన్నికల ప్రచారంలో భాగంగా 64వ డివిజన్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొని స్థానిక ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ నగర అభివృద్ధి, స్థానిక సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ.. గుంటూరు నగరంలోనే నివసిస్తున్న తనకు నగర అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యక్ష అవగాహన ఉందని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తానని పేర్కొన్నారు.

మాజీ మేయర్ కోవెలమూడి నాని, స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు అందించిన సహకారం మాదిరిగానే తాను కూడా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. గుంటూరు నగరాన్ని దేశంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు.

నగర అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గుంటూరును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు పెళ్లి మాణిక్యాలరావు, జనసేన నాయకుడు కిలారి రోశయ్య, కార్పొరేటర్ అభ్యర్థి యర్రంశెట్టి రాజేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#KovelamudiLakshmiAparna #GunturMayorElection #GunturNews #GunturPolitics #64thDivision #NDAAlliance #TDP #Janasena #GunturDevelopment #ElectionCampaign #RamAnjaneyulu #PelliManikyalarao #YerramsettiRajesh #AndhraPradeshNews #APNews #GEE TV #GEETVNews #TeluguNews #GunturLatestNews #MayorCandidate

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply