Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

గుంటూరు, తెనాలిలో అక్టోబర్ 30 మద్యం దుకాణాలు బంద్‌! జిల్లా కలెక్టర్‌, సి.యం. సాయికాంత్‌ వర్మ

0
WhatsApp Image 2026-10-26 at 12.30.08 PM

గుంటూరు, అక్టోబర్ 26: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘం పరిధిలో మద్యం విక్రయాలను నిలిపివేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సి.యం. సాయికాంత్‌ వర్మ తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.

గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘం పరిధిలో నవంబర్‌ 1న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో, ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాల్లో విక్రయాలు నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. సంబంధిత నగరపాలక, పురపాలక చట్టాల్లోని నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

అలాగే నవంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనున్నందున, కౌంటింగ్‌కు 48 గంటల ముందు నుంచి కూడా మద్యం విక్రయాలపై నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడటం, ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

నిషేధ నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే, సంబంధిత ఎన్నికల నిబంధనలు, చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

#GunturNews #Tenali #LiquorBan #LocalBodyElections #APNews #GEETV

Leave a Reply