Flash News

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

vlcsnap-2026-11-05-16h13m45s448 పెద్దకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

గెలుపు మనదే.. మెజారిటీ చరిత్రాత్మకం కావాలి!మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పిలుపు..

0
WhatsApp Image 2026-10-25 at 7.08.41 PM

రిపోర్టర్ – వంశీకృష్ణ పాలడుగు

గుంటూరు: నగర అభివృద్ధిని కొనసాగించేందుకు కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలని గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌లతో కలిసి ఆమె ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి బలపరిచిన 76 మంది కార్పొరేటర్ అభ్యర్థులకు ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యకర్తలను ఉద్దేశించి లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ.. కూటమి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి, ఆ విజయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బహుమతిగా అందించాలని కోరారు. చారిత్రాత్మక మెజారిటీ సాధించడమే ముఖ్యమంత్రికి అందించే అసలైన బహుమతి అని ఆమె పేర్కొన్నారు.

అభివృద్ధి కొనసాగాలంటే కూటమికి మద్దతివ్వండి: పెమ్మసాని

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు పడ్డాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

గుంటూరు నగరంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలంటే మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో పాటు కూటమి బలపరిచిన 76 మంది కార్పొరేటర్ అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కొనసాగింపుగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 68, 69, 70, 71, 72వ డివిజన్ల కూటమి కార్పొరేటర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#LakshmiAparna #PemmasaniChandrasekhar #GunturElections #GunturNews #NDAAlliance #GEETV

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply