పెద్దకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి – ప్రజలకు పిలుపు
V.K PALADUGU | REPORTER | GEETV
గుంటూరు జిల్లా, పొన్నూరు: పెద్దకాకానిలోని హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రానికి ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఈ క్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఓటు వేసేందుకు పెద్దకాకాని హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ క్యూలో వేచి ఉన్న ఓటర్లతో ఆయన ఆప్యాయంగా ముచ్చటిస్తూ, పలువురిని పేరు పేరున పలకరించారు. అనంతరం తన ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యంలో తమకు లభించిన ఓటు హక్కును బాధ్యతగా భావించి తప్పనిసరిగా వినియోగించుకోవాలని బోయపాటి శ్రీను ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.
#BoyapatiSrinu #BoyapatiSrinuVoting #Peddakakani #Ponnur #GunturDistrict #CelebrityVoting #VotingAwareness #APElections #TeluguNews #GEETVNews