Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

తుఫాన్ బాధితులకు ఎస్‌బీఐ భారీ చేయూత.. సీఎం సహాయ నిధికి రూ.5.01 కోట్ల విరాళం

0
WhatsApp Image 2026-10-31 at 12.17.23 PM

అమరావతి, అక్టోబర్ 31: అర్నబ్ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకొచ్చింది. తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల 1 లక్ష రూపాయల భారీ విరాళాన్ని అందించింది.

ఈ మేరకు ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అమర రామ్మోహన్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తుఫాన్ బాధితుల సహాయార్థం అందిస్తున్న విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రికి అందజేసింది.

తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. విపత్తు సమయంలో బాధితులను ఆదుకునేందుకు బ్యాంకు యాజమాన్యం ముందుకు వచ్చి ఉదారంగా విరాళం అందించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల్ కుమార్, జనరల్ మేనేజర్ కుందన్ జ్యోతి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షేక్ షమీన్ భాను తదితరులు పాల్గొన్నారు.

విపత్తు సమయంలో ప్రభుత్వానికి, బాధిత ప్రజలకు వివిధ సంస్థలు అందిస్తున్న సహకారం పునరావాస, సహాయక చర్యలకు తోడ్పాటునందించనుంది. ఎస్‌బీఐ అందించిన రూ.5.01 కోట్ల విరాళం తుఫాన్ బాధితులకు సహాయం అందించడంలో కీలకంగా నిలవనుంది.

#SBIDonation #ChandrababuNaidu #CMReliefFund #ArnabCyclone #AndhraPradesh #APNews #SBI #CycloneRelief #Amaravati #TeluguNews #GEETV #GEETVNews

Leave a Reply