రాప్తాడులో విద్యార్థినిపై అమానుష దాడి.. సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు
అమరావతి, అక్టోబర్ 31: అనంతపురం జిల్లా రాప్తాడులో పాఠశాల విద్యార్థినిపై జరిగిన దారుణ దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ వ్యక్తి రంపంతో అమానుషంగా దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాల తరగతి గదిలోనే విద్యార్థినిపై జరిగిన దాడి గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని, ప్రస్తుతం ఎలాంటి వైద్య చికిత్స అందిస్తున్నారని అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని వెంటనే పట్టుకోవాలని, చట్ట ప్రకారం కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థినికి మెరుగైన వైద్య చికిత్స అందించడంతో పాటు ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
#Rapthadu #Anantapur #StudentAttack #SchoolStudent #ChandrababuNaidu #APCM #AndhraPradesh #StudentSafety #WomenSafety #APNews #AndhraPradeshNews #TeluguNews #BreakingNews #GEETV #GEETVNews