Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

సదరం పరీక్షలకు ఎన్నికల కోడ్‌ నుంచి మినహాయింపు!జిల్లా కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి

0
WhatsApp Image 2026-10-26 at 1.28.49 PM (1)

పచ్చవ పరుశురామ్
జీటీవి బ్యూరో చీఫ్

కడప, అక్టోబర్‌ 25: దివ్యాంగులకు సదరం వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్‌ చెరుకూరి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ, సాధారణ సదరం పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించారు.

దివ్యాంగులకు అవసరమైన సేవలు నిరంతరాయంగా అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. సదరం పరీక్షల కోసం క్రమం తప్పకుండా సమయాలను కేటాయించేందుకు అనుమతి లభించిందని తెలిపారు. దీంతో వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిన అర్హులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు.

సదరం ధ్రువపత్రాలు దివ్యాంగులకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఎంతో ఉపయోగపడతాయని కలెక్టర్‌ తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ వైకల్య నిర్ధారణ పరీక్షలు పూర్తికాకపోవడం లేదా ధ్రువపత్రాలు అందకపోవడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు పొందడంలో ఆలస్యం ఎదుర్కొంటున్న వారికి ఈ నిర్ణయం ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

సదరం పరీక్షల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ సజావుగా సాగేందుకు సంబంధిత శాఖల అధికారులు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సదరం పరీక్షలు చేయించుకోవాల్సిన వారు పరీక్షలకు అందుబాటులో ఉండే తేదీలు, సమయాలను సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకోవాలని సూచించారు. అవసరమైన ధ్రువపత్రాలతో ముందస్తుగా నమోదు చేసుకుని, అధికారుల సూచనలను పాటించాలని కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply