Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

వైద్య విద్యలో పరిశోధనలకు పెద్దపీట.. త్వరలో క్వాంటం బయాలజీ కోర్సు

0
WhatsApp Image 2026-10-26 at 4.02.04 PM

పచ్చవ పరుశురామ్
జీటీవి బ్యూరో చీఫ్

విజయవాడ: వైద్య విద్య, పరిశోధనల్లో నూతన అవకాశాలను అందిపుచ్చుకునేలా త్వరలో ‘క్వాంటం బయాలజీ’ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ పి. చంద్రశేఖర్ తెలిపారు. విశ్వవిద్యాలయం 40వ రూబీ జూబ్లీ వేడుకలు సోమవారం విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దూరదృష్టితో 1986లో దేశంలోనే తొలి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా ఈ సంస్థ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. వైద్య పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే సుమారు రూ.13 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఆధునిక వైద్య అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఫెలోషిప్, సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నామని చెప్పారు.

వైద్యుల నిరంతర శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనల కోసం రాష్ట్రంలో ప్రత్యేక మెడికల్ అకాడమీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏఐ, డిజిటల్ టెక్నాలజీలకు అనుగుణంగా వైద్య విద్యను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

నేషనల్ మెడికల్ కమిషన్ ప్రతినిధి డాక్టర్ ఎం.కె. రమేష్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతతో పాటు మానవీయ విలువలు, సానుభూతి, నైతిక ప్రమాణాలకు వైద్యులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారత్‌లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటు ధరల్లో లభించడం హెల్త్ టూరిజానికి బలమని పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు.

#NTRHealthUniversity #QuantumBiology #MedicalEducation #MedicalResearch #VijayawadaNews #AndhraPradesh #MedicalAcademy #HealthTourism #APNews #TeluguNews #GEETV #GEETVNews

Leave a Reply