Flash News

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

vlcsnap-2026-11-05-16h13m45s448 పెద్దకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

మంచి వైపు నిలబడండి.. ఓటర్లకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిలుపు

0
WhatsApp Image 2026-10-26 at 4.57.50 PM

రిపోర్టర్ – వంశీకృష్ణ పాలడుగు

గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తమ విలువైన ఓటు వేసి మంచి వైపు నిలబడాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 72వ డివిజన్‌లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

వైఎస్సార్‌సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన పాదయాత్రలో అప్పిరెడ్డి పాల్గొన్నారు. 72వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి డాక్టర్ పరిశపోగు భరత్‌తో పాటు మేయర్ అభ్యర్థి తాడికొండ శ్రీదేవిని గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాకతో శివనాగరాజు కాలనీలో ప్రచార సందడి నెలకొనగా, ఎన్టీఆర్ కాలనీలోనూ పర్యటన కొనసాగింది. పలుచోట్ల స్థానిక మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటం, అందుకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడం, యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటుండటం సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి లభిస్తున్న స్పందన తమకు మద్దతుగా ఉందని ఆయన పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చే నాయకులను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు.

ఈ కార్యక్రమంలో బందా రవీంద్రనాథ్, అంగడి శ్రీనివాసరావు, బత్తుల దేవానంద్, మాజీ కార్పొరేటర్లు అంబేద్కర్, వంశీ, గనిక జాన్సీ, బొల్లా మేరి, బోసిపోగు దేవసహాయం, పోలేపల్లి కోటేశ్వరరావు, కడియం ఏసురత్నం, పులుగు చిరంజీవిరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రవీంద్రారెడ్డి, ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు విక్టర్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆలా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

#LellaAppireddy #YSRCP #GunturNews #GunturElections #72ndDivision #GEETV

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply