Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

కందుకూరులో ఎంపీటీసీ నామినేషన్ల సందడి ప్రారంభం

0
WhatsApp Image 2026-10-22 at 9.48.45 AM

ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో స్థానికంగా ఎన్నికల సందడి నెలకొంది. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

కందుకూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో పోలీసుల భద్రత నడుమ నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. తొలి నామినేషన్‌గా విక్కిరాలపేట గ్రామానికి చెందిన టీడీపీ అభ్యర్థి మన్నం సులోచన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అదే గ్రామానికి చెందిన వాసిరాజు సీతామాలక్ష్మమ్మ కూడా నామినేషన్ వేశారు. మాచవరం గ్రామానికి చెందిన టీడీపీ అభ్యర్థులు పొట్టేళ్ల రాము, పొట్లూరి సుశీల సైతం తమ నామినేషన్లను సమర్పించారు.

మరోవైపు వలేటివారిపాలెం మండలంలోనూ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మండలంలోని పది ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి సుజయ్ కుమార్‌కు అందజేసినట్లు ఎంపీడీవో వై. శంకరరావు తెలిపారు.

చుండి గ్రామానికి చెందిన కామినేని రత్న టీడీపీ అభ్యర్థిగా తొలి నామినేషన్ దాఖలు చేయగా, అదే గ్రామానికి చెందిన కామినేని అనూష స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు. నలదలపూరు ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులుగా కోలా నారాయణమ్మ, బండ్లమూడి శివరావమ్మ నామినేషన్లు వేశారు. శింగమనేనిపల్లె ఎంపీటీసీ స్థానానికి ముట్లూరి అనిల్ నామినేషన్ పత్రాలను అందజేశారు.

నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లావణ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

మొత్తంగా కందుకూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రారంభంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రానున్న రోజుల్లో మరింత మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల హడావుడి మొదలైంది.

#Kandukur #PrakasamDistrict #MPTCElections #MPTCNominations #TDP #APLocalElections #AndhraPradesh #TeluguNews #ElectionUpdates #GEETV

Leave a Reply