Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

చీరాల మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్

0
WhatsApp Image 2026-10-22 at 3.51.19 PM

జీటీవి…చీరాల, అక్టోబర్ 22: చీరాల మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 28న జరగనున్న చీరాల మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం ఆయన వివిధ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

చీరాల మున్సిపాలిటీ పరిధిలోని జయంతిపేటలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 41, 43 నంబర్ల పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. అక్కడ ఓటర్లకు కల్పించాల్సిన సౌకర్యాలను పరిశీలించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.

పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితాను స్పష్టంగా కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఓటర్లు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేందుకు అనుకూలమైన మార్గాలు, తాగునీటి సదుపాయం, విద్యుత్, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు.

పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, దివ్యాంగ ఓటర్లు సౌకర్యవంతంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించి, లోపాలు ఉంటే పోలింగ్‌కు ముందే సరిదిద్దాలని స్పష్టం చేశారు.

అనంతరం చీరాల మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బంది మధ్య సమన్వయం, పోలింగ్ కేంద్రాల వారీగా సన్నద్ధత తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్ దానియేలు జోసఫ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ దానియేలు జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.

చీరాల మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ఓటర్ల సౌకర్యాలు, ఎన్నికల సిబ్బంది సన్నద్ధతపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

#Chirala #ChiralaElections #VinodKumar #MunicipalElections #PollingStations #VoterAwareness #AndhraPradesh #APNews #TeluguNews #ElectionUpdates #GEETV

Leave a Reply