Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

గుంటూరు ఎన్నికల్లో కూటమికి ఎదురుదెబ్బ తప్పదా…!?

0
గుంటూరు ఎన్నికల్లో కూటమికి సవాల్

V.K PALADUGU | REPORTER | GEETV

అసలు తెరవెనుక ఏం జరిగింది? గత ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన పోల్ మేనేజ్‌మెంట్ బృందాలు ఈసారి ఎందుకు చర్చకు వస్తున్నాయి? కూటమి నాయకత్వం అనుసరించిన వ్యూహం ఏమిటి? ఓటరు తీర్పు ఎలాంటి రాజకీయ సంకేతాలను ఇవ్వబోతోంది?

గుంటూరు: గెలుపుపై ధీమా.. అధికారంపై నమ్మకం.. ఎన్నికల్లో విజయం తమదేనన్న అంచనాలు! కానీ గుంటూరు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళి, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న కొన్ని పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపుతున్నాయి. కూటమి నేతలు వేసుకున్న రాజకీయ అంచనాలు ఎంతవరకు వాస్తవరూపం దాలుస్తాయి? గత ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన వ్యూహకర్తలు ఈసారి ఎక్కడున్నారు? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

నవంబర్ 1న జరుగుతున్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగుతున్నట్లు తొలి విడత గణాంకాలు సూచిస్తున్నాయి. ఉదయం 2 గంటల సమయానికి గుంటూరులో 45 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. నగర ఓటర్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించకపోవడంతో వివిధ రాజకీయ పార్టీల శిబిరాల్లో పోలింగ్ సరళిపై చర్చ జరుగుతోంది. అయితే తక్కువ పోలింగ్ శాతాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ఏ పార్టీకి అనుకూలమో, ప్రతికూలమో నిర్ణయించడం సాధ్యం కాదు. తుది పోలింగ్ శాతం, ఓటర్ల సామాజిక, ప్రాంతీయ భాగస్వామ్యం కీలకం కానున్నాయి.

ఈ ఎన్నికల్లో మరో ఆసక్తికరమైన అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం తెరవెనుక కీలకంగా పనిచేసిన పోల్ మేనేజ్‌మెంట్ బృందాలు ఈసారి అంతగా కనిపించడం లేదన్న చర్చ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో వ్యూహరచన నుంచి బూత్ స్థాయి నిర్వహణ వరకు, ఓటర్లతో సమన్వయం నుంచి పోలింగ్ రోజున కార్యకర్తలను అప్రమత్తం చేయడం వరకు కొందరు అనుభవజ్ఞులు కీలక పాత్ర పోషించారన్న అభిప్రాయం ఉంది. మరి ఈసారి వారు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉన్నారా? లేక తెరవెనుక వేరే విధంగా పనిచేస్తున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

వారిని కూటమి నాయకత్వమే పక్కన పెట్టిందా? పార్టీలోని కొందరు ముఖ్య నాయకులతో విభేదాల కారణంగా వారు దూరమయ్యారా? గత ఎన్నికల్లో పనిచేసిన వారికి ఈసారి తగిన ప్రాధాన్యత లభించలేదా? లేక పూర్తిగా కొత్త వ్యూహకర్తలకు బాధ్యతలు అప్పగించారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు ఎన్నికల్లో గెలుపు కోసం కేవలం ప్రచారం, నాయకుల హామీలు మాత్రమే సరిపోవు. బూత్ స్థాయిలో సమన్వయం, ఓటర్లతో నిరంతర సంబంధాలు, పోలింగ్ రోజున పటిష్టమైన నిర్వహణ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. గత ఎన్నికల్లో అనుభవం ఉన్నవారి సేవలను ఈసారి ఎంతవరకు వినియోగించుకున్నారన్నది ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం.

ఒకవైపు కూటమి అభ్యర్థులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంటే, మరోవైపు పోలింగ్ సరళి, క్షేత్రస్థాయి సమన్వయం, ఎన్నికల నిర్వహణ వ్యూహాలు రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తక్కువ పోలింగ్ నమోదైనంత మాత్రాన అది ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలమని చెప్పలేం. ఓటరు మౌనం వెనుక ఉన్న అసలు కారణాలు ఫలితాల తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి గుంటూరు మున్సిపల్ ఎన్నికలు కేవలం కార్పొరేటర్, మేయర్ అభ్యర్థుల భవిష్యత్తునే కాకుండా ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాలకు కూడా పరీక్షగా నిలుస్తున్నాయి.

#GunturElections #GunturPolitics #MunicipalElections2026 #CoalitionPolitics #PollManagement #GunturMayor #GunturNews #APPolitics #ElectionAnalysis #GEETV #GEETVNews #TeluguNews

Leave a Reply