ఓటు హక్కును వినియోగించుకున్న మాదల చైతన్య దంపతులు
గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా జనచైతన్య గ్రూప్ అధినేత, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మాదల చైతన్య, ఆయన సతీమణి శ్రీమతి మాదల మీనా రత్న తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గుంటూరులోని స్తంభాలగురువు నగరపాలక ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఇద్దరూ కలిసి చేరుకుని ఓటు వేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి పౌరుడు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామి కావాలని చాటిచెబుతూ తమ బాధ్యతను నిర్వర్తించారు.
నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు నగరంలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
#MadalChaitanya #MadalMeenaRatna #JanaChaitanyaGroup #TDP #TDPYouthLeader #GunturElections #GunturPolling #MunicipalElections #VoteYourRight #GunturNews #AndhraPradesh #TeluguNews #GEETV #GEETVNews