Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

ఏఎన్‌యూ దూరవిద్య పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 11 నుంచి పరీక్షలు

0
WhatsApp Image 2026-10-31 at 6.34.41 PM

డా. పచ్చవ గౌతమి
జీటీవి సీఈఓ

గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే పీజీ, యూజీ, డిప్లమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ పరీక్షలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నట్లు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, దూరవిద్యా పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ పరీక్షల్లో యూజీ ఐదో సెమిస్టర్, పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలతో పాటు వివిధ డిప్లమా, సర్టిఫికెట్ కోర్సులు, బీఎల్ఐసీ, ఎంఎల్ఐసీ వార్షిక, సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఒకే సెషన్‌లో జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ ఏడాది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎయిడెడ్ కళాశాలల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షల తేదీలు, సమయాలు, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన వివరాలను ముందుగానే తెలుసుకుని పరీక్షలకు హాజరుకావాలని అధికారులు సూచించారు.

#ANU #AcharyaNagarjunaUniversity #ANUDistanceEducation #ANUExams #UGExams #PGExams #DistanceEducation #Guntur #EducationNews #APEducation #TeluguNews #GEETV #GEETVNews

Leave a Reply