బాధిత విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన చైర్పర్సన్ డా. రాయపాటి శైలజ
అమరావతి, అక్టోబర్ 31: అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో జరిగిన దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తక్షణమే స్పందించింది. పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ డా. రాయపాటి శైలజ ఘటనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధిత విద్యార్థినితో పాటు, దాడిని అడ్డుకునే ప్రయత్నంలో గాయపడిన మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై చైర్పర్సన్ ఆరా తీశారు. వారికి అందుతున్న వైద్య చికిత్స, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
బాధిత విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనే అంశంపై కమిషన్ ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్పందించిన మహిళా కమిషన్ బాధితుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. పాఠశాలలో విద్యార్థినులపై ఇలాంటి దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. బాధిత విద్యార్థినులకు అవసరమైన సహాయం, భరోసా అందించే దిశగా మహిళా కమిషన్ దృష్టి సారించారు.
#Rapthadu #Anantapur #RayapatiSailaja #APWomenCommission #WomenCommission #StudentAttack #StudentSafety #WomenSafety #AndhraPradesh #APNews #TeluguNews #BreakingNews #GEETV #GEETVNews