రాప్తాడు ఘటనలో కీలక పరిణామం.. నిందితుడు హేమంత్పై పోలీసుల కాల్పులు!
Parasuram Pachava | Bureau Chief | GEETV
అనంతపురం:
రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనతో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆత్మకూరు అడవుల్లో హేమంత్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
ఈ క్రమంలో పోలీసులు హేమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, అతడు పోలీసులపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా పోలీసులు నిందితుడు హేమంత్పై ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం.
పోలీసుల కాల్పుల్లో హేమంత్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది.
రాప్తాడు ఘటన అనంతరం పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.