Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

మహిళలపై హింస నిర్మూలనపై వ్యాసరచన పోటీల బ్రోచర్ విడుదల చేసిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ శైలజ

0
WhatsApp Image 2026-10-22 at 5.23.49 PM

జీటీవి..గుంటూరు: మహిళల సురక్షితమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ శైలజ పిలుపునిచ్చారు. మహిళలపై హింసను అరికట్టేందుకు సమాజంలో విస్తృత అవగాహన, చైతన్యం కల్పించడం అవసరమని ఆమె పేర్కొన్నారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్, ధర్మపీఠం సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులు, పరిశోధక విద్యార్థుల కోసం నిర్వహించనున్న వ్యాసరచన పోటీల బ్రోచర్‌ను గురువారం ఉదయం డాక్టర్ శైలజ విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు నవంబర్‌లో నిర్వహించే మహిళలపై హింస నిర్మూలన అంశానికి అనుగుణంగా ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ శైలజ మాట్లాడుతూ.. మహిళల గౌరవం, భద్రత, హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించాలని సూచించారు. మహిళా సాధికారతకు విద్య, చైతన్యం కీలకమని పేర్కొన్నారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఆచార్యులు, ముఖ్యంగా మహిళా అధ్యయన విభాగం, స్వచ్ఛంద సంస్థలు మహిళల అభ్యున్నతి కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆమె అన్నారు. సమాజంలో మహిళల పట్ల గౌరవభావం పెంపొందించేందుకు విద్యాసంస్థలు, యువత చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

నవంబర్ 25వ తేదీన విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతానని డాక్టర్ శైలజ నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ఈ పోటీల్లో విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహిళలపై హింస నిర్మూలన అంశంపై తమ ఆలోచనలు, అభిప్రాయాలను వ్యాసాల రూపంలో వ్యక్తపరచాలని నిర్వాహకులు కోరారు.

పోటీల్లో పాల్గొనదలచిన వారు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 10వ తేదీలోపు సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ. భవానిని సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ధర్మపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ ఎస్. చంద్రశేఖర్, అధ్యక్షులు శెట్టిపల్లి శశికిరణ్, ఉపాధ్యక్షురాలు తాళ్లూరి ప్రహర్షిత, కార్యదర్శి సంపత్ సంతోష్ కుమార్, సహాయ కార్యదర్శి యర్రంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

#WomenSafety #WomenEmpowerment #DrShailaja #APWomenCommission #ANU #AcharyaNagarjunaUniversity #WomenRights #StopViolenceAgainstWomen #GunturNews #AndhraPradesh #TeluguNews #GEETV

Leave a Reply