Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత

0
85bc7950-89ab-4aa3-9318-c337b58acbf4

అమెరికాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

పచ్చవ పరశురాం

అమరావతి, అక్టోబర్ 30: 1994 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. అమెరికాలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు.

జీవితంతో సాగించిన పోరాటంలో బాలసుబ్రహ్మణ్యం అసాధారణ ధైర్యం, మనోనిబ్బరాన్ని ప్రదర్శించారని డీజీపీ పేర్కొన్నారు. ఆయన మరణం పోలీస్ కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో వివిధ కీలక హోదాల్లో పనిచేసి విశిష్ట సేవలందించిన ఆయన, తన వృత్తిపరమైన నిబద్ధతతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని కొనియాడారు.

జగిత్యాల ఏఎస్పీగా పోలీస్ సర్వీసును ప్రారంభించిన బాలసుబ్రహ్మణ్యం.. అనంతరం గ్రేహౌండ్స్‌తో పాటు నిజామాబాద్, విశాఖపట్నం రూరల్, మహబూబ్‌నగర్, నల్గొండ, ప్రకాశం జిల్లాల ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. పోలీస్ శాఖలో కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగంలో డీఐజీ, ఐజీ హోదాల్లో పనిచేశారు. అదనపు డీజీపీగా, డీజీపీ (ఆర్గనైజేషన్)గా కూడా బాధ్యతలు నిర్వర్తించి తనదైన ముద్ర వేశారు.

అంకితభావం, క్రమశిక్షణ, వృత్తిపరమైన నిబద్ధతతో విధులు నిర్వహించిన ఆయన సేవలు పోలీస్ శాఖకు చిరస్మరణీయమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. సహచర అధికారులతో, సిబ్బందితో ఆయనకు ఉన్న అనుబంధం ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు.

ఈ విషాద సమయంలో బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు డీజీపీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ అపార దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply