Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

ఏపీలో దివ్యాంగులకు శుభవార్త.. సదరం స్లాట్ బుకింగ్‌కు కొత్త నిబంధనలు!

0
WhatsApp Image 2026-10-27 at 12.14.07 PM

డా. పచ్చవ గౌతమి
జీటీవి సీఈఓ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొస్తోంది. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత సదరం స్లాట్ బుకింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో సుమారు 40 వేల మంది దివ్యాంగులకు ఆన్‌లైన్‌లో స్లాట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

సదరం స్లాట్ బుక్ చేసుకున్నవారు వైద్య పరీక్షలకు హాజరుకాకుండా ఆలస్యం చేస్తుండటంతో కొత్త దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్లాట్ బుక్ చేసుకున్న తేదీ నుంచి ఆరు నెలల్లోపు వైద్య పరీక్షలకు హాజరుకావాలనే నిబంధన తీసుకొచ్చారు. గడువులోపు పరీక్షలకు హాజరుకాని వారి వివరాలను ఆన్‌లైన్‌ నుంచి తొలగించే అవకాశం ఉంటుంది.

దివ్యాంగులు సదరం స్లాట్లను మనమిత్ర వాట్సాప్ సేవ, ఏపీ సేవా సిటిజన్ పోర్టల్, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ప్రక్రియలో ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంతో కొత్త స్లాట్ పొందడం మరింత సులభం కానుంది.

సదరం వైద్య పరీక్షల్లో అర్హత సాధించని వారికి మళ్లీ అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలకు వెళ్లే దివ్యాంగులకు అవసరమైన సమాచారం అందించేందుకు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విధానాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు.

సదరం కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, పాత వైద్య నివేదికలను సిద్ధంగా ఉంచుకోవాలి. కొత్త స్లాట్ బుకింగ్ ప్రారంభ తేదీ, విధివిధానాలను అధికారిక ప్రకటన ద్వారా నిర్ధారించుకోవాలని దివ్యాంగులకు సూచిస్తున్నారు

#Sadarem #SadaremCertificate #APGovernment #Divyangulu #DisabilityCertificate #ManaMitra #AndhraPradesh #GovernmentSchemes #TeluguNews #GEETVNews.

Leave a Reply