Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

ఏపీలో నామినేషన్ల వేళ హింస.. 31 ఘటనలు నమోదు!

0
WhatsApp Image 2026-10-23 at 1.29.37 PM

డా. పచ్చవ గౌతమి
జీటీవి సీఈఓ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 31 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లు డీజీపీ కార్యాలయం వెల్లడించింది. వీటిలో 22 దాడులకు సంబంధించిన ఘటనలు కాగా, మరో 9 చోట్ల నామినేషన్ పత్రాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది.

ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ కార్యాలయం పేర్కొంది. మొత్తం 54 మంది నిందితులను గుర్తించినట్లు వెల్లడించింది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న ఘటనలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఎన్నికల సమయంలో హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించబోమని, హింసను ప్రేరేపించే వారిపై నిబంధనల ప్రకారం నాన్‌-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు, నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. అభ్యర్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అవసరమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం వెల్లడించింది.

ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు, అభ్యర్థులు శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని అధికారులు సూచించారు.

#APElections #ElectionViolence #APPolice #DGP #AndhraPradesh #ElectionNews #TeluguNews #BreakingNews #నామినేషన్లు #ఎన్నికలహింస #GEETV

Leave a Reply