మురుసు తుఫాన్‌పై జిల్లా యంత్రాంగం అప్రమత్తం : కలెక్టర్ సాయికాంత్ వర్మ
మండల స్థాయి వరకు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
V.K. PALADUGU | REPORTER | GEETV
గుంటూరు: మురుసు తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
సోమవారం గుంటూరులో మాట్లాడిన కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ తుఫాన్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు మండల స్థాయి కార్యాలయాల వరకు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు.
తుఫాన్ ప్రభావంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా, అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08632234014 ను సంప్రదించాలని సూచించారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, తుఫాన్ పరిస్థితులపై నిరంతర నిఘా ఉంచాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలు, హెచ్చరికలను పాటించాలని కోరారు.
#MurusuCyclone #CycloneAlert #GunturCollector #CMSaikantVarma #GunturNews #ControlRoom #DisasterManagement #AndhraPradesh #APNews #CycloneUpdates #PublicSafety #GEETV #GEETVNews