రైతు బజార్‌ను సందర్శించిన లక్ష్మీ అపర్ణ.. సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన
రిపోర్టర్ – వంశీకృష్ణ పాలడుగు
గుంటూరు: నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ కృష్ణానగర్‌లోని రైతు బజార్‌ను సందర్శించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారులు, వినియోగదారులను కలుసుకుని ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.
రైతులు, వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే రైతు బజార్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇచ్చారని లక్ష్మీ అపర్ణ పేర్కొన్నారు. కృష్ణానగర్ రైతు బజార్లో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో రెండు అంతస్తుల భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని, నిర్మాణ పనులు మరికొన్ని నెలల్లో పూర్తవుతాయని తెలిపారు.
నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగేందుకు ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నవంబర్ 1న జరిగే పోలింగ్‌లో బ్యాలెట్‌పై సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను మేయర్ అభ్యర్థిగా, ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
#GunturNews #LakshmiAparna #KovelamudiLakshmiAparna #KrishnaNagar #RythuBazar #GunturElections #NDAAlliance #TDP #AndhraPradeshNews #GEETVNews
