పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి
పచ్చవ పరుశురామ్
జీటీవి బ్యూరో చీఫ్
పల్నాడు: మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి జీవితం, ఆయన బోధనలు సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. సమాజంలో సానుకూల విలువలను పెంపొందించేందుకు మహర్షుల బోధనలు స్ఫూర్తినిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, ఐపీఎస్, ఏఆర్ డీఎస్పీ గాంధీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#ValmikiJayanti #Palnadu #PalnaduPolice #SPJagadish #AndhraPradeshNews #GEETV
