లాడ్జి సెంటర్ చర్చిలో లక్ష్మీ అపర్ణ విజయం కోసం ప్రత్యేక ప్రార్థనలు
రిపోర్టర్ – వంశీకృష్ణ పాలడుగు
గుంటూరు: లాడ్జి సెంటర్లోని నార్త్ పారిష్ లూథరన్ చర్చిలో కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎన్నికల్లో ఆమె విజయం సాధించాలని చర్చి సంఘ సభ్యులు ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా చర్చి ఫాదర్ మాట్లాడుతూ.. గతంలో కోవెలమూడి నాని మేయర్గా ఉన్న సమయంలో చర్చి నిర్మాణానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. ఆ సమస్యను నాని దృష్టికి తీసుకెళ్లగా, ఆయన కులమతాలకు అతీతంగా స్పందించి సహకారం అందించారని గుర్తుచేశారు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతులు పొందడంలో కొంత జాప్యం జరిగినప్పటికీ, నాని చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి సహాయం చేశారని పేర్కొన్నారు.
గతంలో తమకు అందించిన సహకారాన్ని గుర్తుచేసుకుంటూ, కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ఎన్నికల్లో విజయం సాధించాలని చర్చి సంఘ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిషప్ డాక్టర్ ఎస్.జె. బాబురావు, పురుషోత్తం చౌదరి, శామ్యూల్ జాన్, పాస్టర్ కిరణ్, రెవరెండ్ ఆర్. మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
#LakshmiAparna #GunturMayorElection #GunturNews #SpecialPrayers #GEETV
