గుంటూరు పశ్చిమంలో టీడీపీలోకి వైసీపీ నేతలు: ఎమ్మెల్యే గళ్ళా మాధవి
డా. పచ్చవ గౌతమి
జీటీవి సీఈఓ
గుంటూరు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు పెరుగుతోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నియోజకవర్గంలోని 31వ డివిజన్‌కు చెందిన పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
గళ్ళా మాధవి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు నాలుగు చక్రాల బండ్ల పంపిణీ, ముస్లిం సోదరుల అంత్యక్రియల అవసరాల కోసం రూ.15 లక్షల విలువైన వాహనాన్ని అందజేయడం వంటి కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.
అలాగే పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 55 మంది విద్యార్థులకు ఢిల్లీ విహారయాత్ర ఏర్పాటు చేయడం విద్యార్థులను ప్రోత్సహించే చర్యగా వారు అభివర్ణించారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి వారం డివిజన్లలో మెగా వైద్య శిబిరాలు నిర్వహించడం, మహిళలు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలు చేపట్టడం వంటి కార్యక్రమాలను వారు ప్రస్తావించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. ఈ చేరికలతో 31వ డివిజన్లో పార్టీ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని టీడీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
టీడీపీలో చేరిన వారిలో ఏకలవ్య ఎరుకల ట్రైబల్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుందనాటి సంజయ్ బాబు, వైఎస్సార్సీపీ 31వ వార్డు బీసీ సెల్ అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాస్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు బొగ్గవరపు ఏసుపాదం, వైఎస్సార్సీపీ జిల్లా నాయకుడు బొగ్గవరపు సతీష్ బాబు, 31వ వార్డు బీసీ సెల్ కార్యదర్శి వణుకూరి శివరామకృష్ణ ప్రసాద్ ఉన్నారు. వీరితో పాటు బొమ్మిశెట్టి మధు, గార్లపాటి రమేష్, మామిడాల సత్యనారాయణ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి 31వ డివిజన్ అభ్యర్థి గంటా మౌళికతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#GunturNews #GallaMadhavi #TDP #YSRCP #GunturWest #AndhraPradeshPolitics #GEETVNews
