Flash News

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురాసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

vlcsnap-2026-11-05-16h13m45s448 పెద్దకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

0
WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM

V.K. PALADUGU | REPORTER | GEETV

GEETV, గుంటూరు: గుంటూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్న తీరును, కేంద్రాల వద్ద నెలకొన్న పరిస్థితులను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత, పోలీస్ బందోబస్తు, విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తతపై ఆరా తీశారు. ఎన్నికల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తీసుకున్న చర్యలను సమీక్షించారు.

ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతోందని, భద్రత విషయంలో ఎక్కడా నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

ఈ తనిఖీల్లో ఎస్పీ వకుల్ జిందాల్ వెంట అదనపు ఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి, నార్త్ డీఎస్పీ కె. వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ అలహరి శ్రీనివాస్, పెదకాకాని సీఐ నారాయణస్వామి తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

#Guntur #ANU #VoteCounting #MunicipalElections #VakulJindal #GunturSP #GunturPolice #CountingCenter #ElectionResults2026 #PoliceSecurity #AndhraPradesh #GunturNews #GEETV #GEETVNews

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply