Flash News

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురాసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

vlcsnap-2026-11-05-16h13m45s448 పెద్దకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
5

GEETV, అమరావతి: మురుసు తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుపాను పరిస్థితులు, భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల రాకపోకల నిర్వహణపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతను బట్టి బస్సుల రాకపోకలపై నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో, ఈదురుగాలులు తీవ్రంగా ఉన్న మార్గాల్లో ప్రయాణికుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా అవసరమైతే బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు.

ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆర్టీసీ డిపోల వారీగా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, ప్రతి డిపోలో అత్యవసర సేవల నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

అలాగే రహదారుల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ప్రయాణానికి అనుకూలమైన సురక్షిత మార్గాల్లోనే బస్సులను నడపాలని మంత్రి స్పష్టం చేశారు. నీట మునిగిన రహదారులు, ప్రమాదకర ప్రాంతాల్లో బస్సులను నడిపే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.

తుపాను ప్రభావం తగ్గిన వెంటనే నిలిచిపోయిన బస్సు సర్వీసులను పరిస్థితులకు అనుగుణంగా పునరుద్ధరించాలని తెలిపారు. బస్సుల రాకపోకల్లో మార్పులు, సర్వీసుల నిలిపివేత వంటి వివరాలను ప్రయాణికులకు ముందుగానే తెలియజేసేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను సమయంలో రవాణా వ్యవస్థకు అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ప్రయాణికుల భద్రత విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.

#MurusuCyclone #CycloneAlert #MandipalliRamprasadReddy #APSRTC #APRTC #APTransport #PassengerSafety #AndhraPradesh #APNews #CycloneUpdates #TeluguNews #GEETV #GEETVNews

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply