Flash News

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

vlcsnap-2026-11-05-16h13m45s448 పెద్దకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్

0
WhatsApp Image 2026-10-26 at 7.06.37 PM

తిరుమల, అక్టోబర్ 26: భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల, తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుమలకు చేరుకున్న ఆయన ముందుగా క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అర్చక బృందం ఆలయ సంప్రదాయాల ప్రకారం ఇస్తికఫాల్ స్వాగతం అందించింది. అనంతరం ఉపరాష్ట్రపతి ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీ వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకుని ప్రార్థనలు చేశారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఉపరాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో, అదనపు ఈవో స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు. అనంతరం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామివారిని కూడా ఉపరాష్ట్రపతి దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, టీటీడీ బోర్డు సభ్యులు రామ్మూర్తి, దివాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, పలువురు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఉపరాష్ట్రపతి తిరుమల పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగత ఏర్పాట్లు నిర్వహించారు.

#CPRadhakrishnan #VicePresidentOfIndia #Tirumala #SrivariDarshan #LordVenkateswara #TirumalaTemple #TTD #TirupatiNews #AnaganiSatyaPrasad #AndhraPradeshNews #TeluguNews #GEETV

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply