Flash News

WhatsApp Image 2026-11-07 at 12.57.33 PM ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

ANU నాగార్జున యూనివర్సిటీలో అంతా మా ఇష్టమేనా?

vlcsnap-2026-11-06-23h31m36s921 ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అరెస్ట్.. 19 వరకు రిమాండ్

pullarao ఐదేళ్లు పాపాలు చేసి.. ఇప్పుడు నీతులా? జగన్‌పై ప్రత్తిపాటి పుల్లారావు ఘాటు విమర్శలు

WhatsApp Image 2026-11-06 at 9.16.12 AM స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు షాక్.. బడ్జెట్ ఫోన్ల ధరలు 30% పెరిగే ఛాన్స్

WhatsApp Image 2026-11-06 at 6.13.14 PM తుపాను బాధిత ప్రతి రైతునూ ఆదుకుంటాం – మంత్రి గొట్టిపాటి |

WhatsApp Image 2026-11-06 at 5.19.55 PM వెంగళాయపాలెం ఘటనపై చర్యలు.. ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి మెడికల్ టెస్టులు

WhatsApp Image 2026-11-05 at 10.31.05 PM తమిళనాడు మత్స్యకారుల మృతదేహాల పరిశీలన.. ఒంగోలుకు చేరుకున్న మంత్రి మేరీ విల్సన్!

APP బ్యాలెట్ బాక్స్ కిందకు దించడంపై రగడ | వెంగళాయపాలెంలో వైసీపీ ఆందోళన

WhatsApp Image 2026-11-05 at 9.58.09 PM చెన్నై వివాహ వేడుకలో వైఎస్ జగన్ దంపతులు.. శ్రేయ–ఉజ్వల్‌లకు ఆశీర్వాదం

వెంగళాయపాలెం ఘటనపై చర్యలు.. ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి మెడికల్ టెస్టులు

0
WhatsApp Image 2026-11-06 at 5.19.55 PM

కోర్టులో హాజరుకు ముందు ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి వైద్య పరీక్షలు!

బ్యాలెట్ బాక్సుల మార్పిడి ఆరోపణలతో పోలీసుల అదుపులోకి వైసీపీ ఎమ్మెల్సీ

నగరంపాలెం నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలింపు..

V.K PALADUGU | REPORTER | GEETV

GEETV, గుంటూరు: పరిషత్ ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సుల తరలింపు సమయంలో గందరగోళం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో బ్యాలెట్ బాక్సులను మారుస్తున్నారంటూ వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిన్న సాయంత్రం వెంగళాయపాలెంలో ఎన్నికల బ్యాలెట్ బాక్సులను తరలించే సమయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. బ్యాలెట్ బాక్సులను మారుస్తున్నారంటూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు ఆయన అనుచరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాలెట్ బాక్సుల తరలింపు ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తొలుత నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు, అనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.  కోర్టులో హాజరుపరిచే ప్రక్రియలో భాగంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్) వైద్యులు ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ బాక్సుల తరలింపు వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తుండగా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అరెస్టు పరిణామం గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

#MLCAppireddy #LellaAppireddy #GunturNews #YSRCP #BallotBoxControversy #Vengalayapalem #GunturPolitics #AndhraPradesh #TeluguNews #GEETV

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply