ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అరెస్ట్.. 19 వరకు రిమాండ్
వెంగళాయపాలెం బ్యాలెట్ బాక్సుల వివాదం.. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
V.K PALADUGU | REPORTER | GEETV
GEETV, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ఈ నెల 19వ తేదీ వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో పరిషత్ ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సులను మార్చేందుకు టీడీపీ నాయకులు పోలీసుల, అధికారుల సహకారంతో ప్రయత్నించారంటూ ఆరోపిస్తూ అప్పిరెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
గురువారం రాత్రి అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తొలుత నగరంపాలెం పోలీస్ స్టేషన్కు, అనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి శుక్రవారం సాయంత్రం వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం జిల్లా కోర్టులో హాజరుపరిచారు.
ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ఈ నెల 19వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పిరెడ్డిని తదుపరి న్యాయ ప్రక్రియ నిమిత్తం పోలీసులు తరలించారు.
#LeellaAppireddy #AppireddyArrest #AppireddyRemand #Vengalayapalem #BallotBoxControversy #YSRCP #GunturNews #AndhraPradeshPolitics #GEETVNews