Flash News

WhatsApp Image 2026-11-07 at 12.57.33 PM ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

ANU నాగార్జున యూనివర్సిటీలో అంతా మా ఇష్టమేనా?

vlcsnap-2026-11-06-23h31m36s921 ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అరెస్ట్.. 19 వరకు రిమాండ్

pullarao ఐదేళ్లు పాపాలు చేసి.. ఇప్పుడు నీతులా? జగన్‌పై ప్రత్తిపాటి పుల్లారావు ఘాటు విమర్శలు

WhatsApp Image 2026-11-06 at 9.16.12 AM స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు షాక్.. బడ్జెట్ ఫోన్ల ధరలు 30% పెరిగే ఛాన్స్

WhatsApp Image 2026-11-06 at 6.13.14 PM తుపాను బాధిత ప్రతి రైతునూ ఆదుకుంటాం – మంత్రి గొట్టిపాటి |

WhatsApp Image 2026-11-06 at 5.19.55 PM వెంగళాయపాలెం ఘటనపై చర్యలు.. ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి మెడికల్ టెస్టులు

WhatsApp Image 2026-11-05 at 10.31.05 PM తమిళనాడు మత్స్యకారుల మృతదేహాల పరిశీలన.. ఒంగోలుకు చేరుకున్న మంత్రి మేరీ విల్సన్!

APP బ్యాలెట్ బాక్స్ కిందకు దించడంపై రగడ | వెంగళాయపాలెంలో వైసీపీ ఆందోళన

WhatsApp Image 2026-11-05 at 9.58.09 PM చెన్నై వివాహ వేడుకలో వైఎస్ జగన్ దంపతులు.. శ్రేయ–ఉజ్వల్‌లకు ఆశీర్వాదం

ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

0
WhatsApp Image 2026-11-07 at 12.57.33 PM

కౌంటింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు.. అధికారుల పనితీరుపై ఎన్నికల కమిషనర్ ప్రశంసలు

23 మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీ ఎన్నికలపై త్వరలో నిర్ణయం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన అనిల్ చంద్ర పునేఠ

Parasuram Pachava | Bureau Chief | GEETV

GEETV, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల్లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయగా, ఎన్నికల నిర్వహణ తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సంతృప్తి వ్యక్తం చేశారు.

శనివారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సందర్శించి పరిశీలించారు. తొలుత పెదకాకాని, ఫిరంగిపురం మండలాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి లెక్కింపు ఏర్పాట్లు, ప్రక్రియ నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. కౌంటింగ్ ఏజెంట్లతో మాట్లాడి లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనిల్ చంద్ర పునేఠ.. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. గుంటూరు జిల్లాలోని 13 మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని చెప్పారు. ఎన్నికల నిబంధనల ప్రకారం తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించినట్లు వివరించారు.

కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలు, వీడియో రికార్డులను 60 రోజుల పాటు భద్రపరుస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంబంధిత జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.

పల్నాడు జిల్లా కంకణాలపల్లి గ్రామానికి చెందిన కొంతమంది గ్రామస్తులు తమ సమస్యలపై అందించిన వినతులపైనా కమిషనర్ స్పందించారు. గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 23 మున్సిపాలిటీలతో పాటు సుమారు 13 వేల గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అనిల్ చంద్ర పునేఠ వెల్లడించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీల ఎన్నికల అంశాన్ని కూడా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను మధ్యాహ్నం 4 గంటలలోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని, మొత్తం కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రంలోగా ముగుస్తుందని ఆశిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

#MPTCCounting #ZPTCCounting #ElectionResults #AnilChandraPunetha #ANU #GunturNews #APElections #MunicipalElections #GramPanchayatElections #ElectionCommission #AndhraPradesh #GEETVNews

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply