Flash News

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

vlcsnap-2026-11-05-16h13m45s448 పెద్దకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

మేయర్ పీఠం దిశగా అపర్ణ అడుగులు..!   

0
14

ప్రజలతో మమేకం.. నగర భవిష్యత్తుపై స్పష్టమైన విజన్  

విమర్శలకు దూరంగా.. ప్రజా సమస్యలే ప్రచార అజెండాగా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ 

V.K Paladugu | Reporter | GEETV

అమరావతి, అక్టోబర్ 31 : గుంటూరు నగర మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ తనదైన ప్రత్యేక ప్రచార శైలితో ప్రజల దృష్టిని ఆకర్షించారు. సాధారణంగా ఎన్నికల ప్రచారమంటే రాజకీయ విమర్శలు, ప్రత్యర్థులపై ఆరోపణలు, మాటల యుద్ధాలు కనిపిస్తుంటాయి. అయితే లక్ష్మీ అపర్ణ మాత్రం అందుకు భిన్నంగా నగర అభివృద్ధి, ప్రజా సమస్యలు, భవిష్యత్తు అవసరాలనే ప్రధాన అంశాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లారు. వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వకుండా గుంటూరు నగర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తన ప్రచారాన్ని కొనసాగించడం ప్రత్యేకతగా నిలిచారు.

ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి చివరి నిమిషం వరకు లక్ష్మీ అపర్ణ నగరంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కేవలం ప్రచార కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజలను నేరుగా కలుసుకుంటూ వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. కాలనీలు, ప్రధాన రహదారులు, వాణిజ్య ప్రాంతాలు, పార్కులు, వాకింగ్ ట్రాక్‌ల వద్ద ప్రజలతో మమేకమయ్యారు. మహిళలు, యువత, వ్యాపారులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి వారి అవసరాలు, సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ సాగిన ఈ ప్రచారం ఆమె ఎన్నికల ప్రస్థానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

నగరాభివృద్ధికి ప్రాధాన్యత.. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి….

గుంటూరు నగర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను లక్ష్మీ అపర్ణ తన ప్రచారంలో ప్రస్తావించారు. ముఖ్యంగా రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, నిరంతర తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, పచ్చదనం పెంపు, మహిళల భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు గుంటూరును మరింత పరిశుభ్రమైన, సుందరమైన నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని వివరించారు. నగరాభివృద్ధి అనేది కేవలం ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలకే పరిమితం కాకూడదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియగా ఉండాలని తన ప్రచారం ద్వారా స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన నగరాన్ని అందించాలంటే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అవసరమనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం కూటమికి బలంగా మారింది.   కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు ప్రచారంలో పాల్గొంటూ నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రజలకు వివరించారు. డివిజన్ల వారీగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం, నాయకుల భాగస్వామ్యం ప్రచార కార్యక్రమాలకు మరింత ఊపునిచ్చాయి. ముఖ్యంగా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశంతో కూటమి అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, నగర భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను చర్చకు తీసుకురావడం ఈ ప్రచారంలో ప్రధానంగా కనిపించింది.

కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూ, నగర అభివృద్ధి అంశాలకు పెద్దపీట వేశారు. రాజకీయ విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాలు, మహిళల భద్రత, పచ్చదనం, మెరుగైన నగర పాలన వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లారు. గుంటూరు నగరాన్ని అభివృద్ధి దిశగా మరింత ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో సాగిన ఆమె ప్రచారం ప్రత్యేకతను చాటి చెప్పారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగిన లక్ష్మీ అపర్ణ ప్రచార శైలి ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలిచారు.

#KovelamudiLakshmiAparna #LakshmiAparna #GunturMayor #GunturElections2026 #GunturDevelopment #CityDevelopment #PeopleFirst #PublicIssues #NDAAlliance #GunturPolitics #PemmasaniChandrasekhar #AndhraPradesh #TeluguNews #GEETV #GEETVNews

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply