Flash News

WhatsApp Image 2026-11-07 at 12.57.33 PM ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

ANU నాగార్జున యూనివర్సిటీలో అంతా మా ఇష్టమేనా?

vlcsnap-2026-11-06-23h31m36s921 ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అరెస్ట్.. 19 వరకు రిమాండ్

pullarao ఐదేళ్లు పాపాలు చేసి.. ఇప్పుడు నీతులా? జగన్‌పై ప్రత్తిపాటి పుల్లారావు ఘాటు విమర్శలు

WhatsApp Image 2026-11-06 at 9.16.12 AM స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు షాక్.. బడ్జెట్ ఫోన్ల ధరలు 30% పెరిగే ఛాన్స్

WhatsApp Image 2026-11-06 at 6.13.14 PM తుపాను బాధిత ప్రతి రైతునూ ఆదుకుంటాం – మంత్రి గొట్టిపాటి |

WhatsApp Image 2026-11-06 at 5.19.55 PM వెంగళాయపాలెం ఘటనపై చర్యలు.. ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి మెడికల్ టెస్టులు

WhatsApp Image 2026-11-05 at 10.31.05 PM తమిళనాడు మత్స్యకారుల మృతదేహాల పరిశీలన.. ఒంగోలుకు చేరుకున్న మంత్రి మేరీ విల్సన్!

APP బ్యాలెట్ బాక్స్ కిందకు దించడంపై రగడ | వెంగళాయపాలెంలో వైసీపీ ఆందోళన

WhatsApp Image 2026-11-05 at 9.58.09 PM చెన్నై వివాహ వేడుకలో వైఎస్ జగన్ దంపతులు.. శ్రేయ–ఉజ్వల్‌లకు ఆశీర్వాదం

తమిళనాడు మత్స్యకారుల మృతదేహాల పరిశీలన.. ఒంగోలుకు చేరుకున్న మంత్రి మేరీ విల్సన్!

0
WhatsApp Image 2026-11-05 at 10.31.05 PM

Parasuram Pachava | Bureau Chief | GEETV

GEETV, ఒంగోలు: కొత్తపట్నం సముద్రతీరంలో లభ్యమైన తమిళనాడు మత్స్యకారుల మృతదేహాలను గుర్తించేందుకు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎన్. మేరీ విల్సన్ గురువారం రాత్రి ఒంగోలుకు చేరుకున్నారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక జీజీహెచ్ మార్చురీకి వెళ్లి అక్కడ భద్రపరిచిన మృతదేహాలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబుతో కలిసి మంత్రి పరిస్థితిని సమీక్షించారు.

తమిళనాడుకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు పడవలో సముద్రంలోకి వెళ్లిన సమయంలో ప్రమాదానికి గురై గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. వాటిలో నాలుగు మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తించినట్లు మంత్రి మేరీ విల్సన్ వెల్లడించారు. మిగిలిన మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని తెలిపారు. పోలీసుల విచారణ, పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన అనంతరం మృతదేహాలను తమిళనాడుకు తరలిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ.. కొత్తపట్నం సముద్రతీరంలో బోల్తా పడిన బోటు తమిళనాడుకు చెందినదని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యలపై సమీక్షించినట్లు వివరించారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం శుక్రవారం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు.

మత్స్యకారుల కుటుంబాలకు అవసరమైన సహకారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అధికార యంత్రాంగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. సముద్రంలో గల్లంతైన మిగిలిన మత్స్యకారుల ఆచూకీ లభిస్తుందనే ఆశతో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.

#OngoleNews #Kothapatnam #TamilNaduFishermen #FishermenTragedy #MaryWilson #GGHOngole #PrakasamDistrict #AndhraPradeshNews #FishermenRescue #TeluguNews #GEETVNews

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply