Flash News

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

vlcsnap-2026-11-05-16h13m45s448 పెద్దకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా కూటమి ప్రభుత్వం టీడీపీ అభ్యర్థి పోతురాజు సమత విస్తృత ప్రచారం

0
samatha

స్టాఫ్ రిపోర్టర్ః వంశీ పాలడుగు
జీటీవి


గుంటూరు:
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 9వ వార్డు కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోతురాజు సమత అన్నారు. శుక్రవారం 9వ డివిజన్‌లో ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుంటూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన పోతురాజు సమత, గత పదేళ్ల కాలంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మహమ్మద్ ముస్తఫా నిధులు లేవనే కారణంతో అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని సమత పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికులను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. స్థానిక సమస్యల పరిష్కారం, వార్డు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని పోతురాజు సమత తెలిపారు.

#PoturajuSamatha #TDP #GunturNews #GunturEast #9thWard #TDPNews #APPolitics #AndhraPradesh #GunturElections #ElectionCampaign #TeluguNews #GEE TV #GEENews #LatestNews #APNews

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply