Flash News

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

vlcsnap-2026-11-05-16h13m45s448 పెద్దకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

ప్రజల ఆదరణే నా బలం: గుంటూరు ఈస్ట్ 8వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వినోద రాణి..

0
vinado rani

స్టాఫ్ రిపోర్టర్ః వంశీ పాలడుగు
జీటీవి

గుంటూరు: ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణ, అభిమానాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని గుంటూరు ఈస్ట్ పరిధిలోని 8వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వినోద రాణి తెలిపారు. శుక్రవారం ఆమె డివిజన్‌లో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వినోద రాణి ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని తమ ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆమె తెలిపారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన వినోద రాణి, వార్డులో పర్యటిస్తున్న సమయంలో ప్రజలు చూపిస్తున్న ఆదరణ తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను గుర్తించి, తన విజయం అనంతరం కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆమె, వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని వినోద రాణి స్థానిక ఓటర్లను కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని తెలిపారు.

#VinodaRani #YSRCP #GunturEast #GunturNews #8thWard #YSRCPNews #GunturElections #ElectionCampaign #APPolitics #AndhraPradesh #TeluguNews #GEETV #GEENews

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply