Flash News

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

vlcsnap-2026-11-05-16h13m45s448 పెద్దకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

రాప్తాడు బాధిత బాలికను పరామర్శించిన మంత్రి లోకేష్..

0
WhatsApp Image 2026-11-01 at 4.51.12 PM

బెంగళూరు: రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానుష దాడిలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఉన్న మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన, అందుతున్న చికిత్స వివరాలపై ఆసుపత్రి వైద్యులతో సుదీర్ఘంగా చర్చించారు.

విద్యార్థినికి అవసరమైన శస్త్రచికిత్సలను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేశామని, ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు మంత్రికి వివరించారు. అయితే రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని, ఈ సమయంలో బాలిక ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్.. వచ్చే 48 గంటల పాటు బాలిక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. బాలికను తమ బిడ్డలా భావించి చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. బాలిక ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం బాలిక చికిత్స పొందుతున్న పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు వెళ్లిన మంత్రి, అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరిశీలించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం, వ్యక్తిగతంగా తాను కూడా బాలిక కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఘటన జరిగిన తీరును స్కూల్ ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిపై దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మంత్రి నారా లోకేష్ వెంట ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా తదితరులు ఉన్నారు.

తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని మంత్రి ఆకాంక్షించారు.

#NaraLokesh #RapthaduIncident #ManipalHospital #Bengaluru #AndhraPradeshNews #GirlSafety #JusticeForRapthaduGirl #APNews #GEETVNews

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply