పోలింగ్‌పై ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక నిఘా.. డ్రోన్లు, వెబ్‌కాస్టింగ్‌తో పర్యవేక్షణ |
రిపోర్టర్ – వంశీకృష్ణ పాలడుగు
గుంటూరు: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ, డ్రోన్లు, సమర్థ యాప్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, పోలీసుల విధులు, శాంతిభద్రతల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు.
జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసేలా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.
#VakulJindal #GunturSP #GunturPolice #GunturElections #PollingMonitoring #DroneSurveillance #Webcasting #ElectionSecurity #MunicipalElections #GunturNews #AndhraPradesh #TeluguNews #GEETV #GEETVNews