రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ ధర్నా!

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంపై నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసేందుకు వచ్చినప్పటికీ అపాయింట్‌మెంట్ లభించలేదని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో తమ పార్టీ అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా అవకాశం కల్పించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని, అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియలో తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని, కొన్నిచోట్ల అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం, గృహ నిర్బంధాలకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. కొందరు అభ్యర్థులపై దాడులు చేసి గాయపరిచిన అనంతరం పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై సంబంధిత అధికారులు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా రక్షణ కల్పించాలని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల భద్రత, నామినేషన్ల స్వీకరణలో పారదర్శకత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు నిలదీశారు. గతంలోనే ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని, తాజాగా కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు. ఫిర్యాదులపై స్పందించి, ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

#YSRCP #APPolitics #AndhraPradesh #MPTC #ZPTC #LocalBodyElections #YSRCPProtest #Vijayawada #ElectionCommission #APNews #TeluguNews #BreakingNews #PoliticalNews #GEETV

గుంటూరులో కూటమి మేయర్ అభ్యర్థి ప్రచారం ముమ్మరం

GEETV: గుంటూరులో కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి కూటమిలోని మూడు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. గుంటూరు నగరం మరింత అభివృద్ధి చెందాలంటే కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణను గెలిపించాలని పిలుపునిచ్చారు. కోవెలమూడి నాని కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ విధానాల వల్ల నగర అభివృద్ధి కుంటుపడుతుందని విమర్శించారు. అందుకే లక్ష్మీ అపర్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

అనంతరం ఎంపీ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ.. కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగర అభివృద్ధికి ఓటర్లంతా కూటమి అభ్యర్థికి ఓటు వేసి సహకరించాలని కోరారు. ఈ ఆత్మీయ సమావేశంలో కూటమి నేతలు ఎన్నికల ప్రచారం, నగర అభివృద్ధి అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.


#Guntur #GunturMayorElection #GunturElections #KovelamudiLakshmiAparna #DokkaManikyaVaraPrasad #BhashyamRamakrishna #AllianceCandidate #TDP #Janasena #BJP #YSRCP #APPolitics #AndhraPradesh #ElectionCampaign #TeluguNews #LatestTeluguNews
#గుంటూరు #గుంటూరుమేయర్ఎన్నికలు #కూటమి #లక్ష్మీఅపర్ణ #డొక్కామాణిక్యవరప్రసాద్ #భాష్యంరామకృష్ణ #ఎన్నికలప్రచారం #ఆంధ్రప్రదేశ్ #తెలుగువార్తలు

నోటిఫికేషన్ లేకుండానే ANU ఐసీటీ డైరెక్టర్ పోస్టు సృష్టించారా?

“స్నేహితుడి కోసం పదవి ఇచ్చాడా…! స్నేహానికి పట్టం కట్టాడా? ఇన్‌చార్జి వీసీగా వచ్చిన రెండు నెలలకే ఐసీటీ డైరెక్టర్ పదవి గిఫ్టుగా ఇచ్చాడా? నెలకు లక్షన్నర జీతంతో వాహనం సౌకర్యాలు ఇచ్చి స్నేహానికి విలువ పెంచాడా? నోటిఫికేషన్ లేకుండా ఐసీటీ డైరెక్టర్ పదవి స్నేహానికి కానుకగా ఇచ్చారా? స్నేహం వెనుక ఉన్న కథేంటి?.. Let’s see the story…”
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వివిధ పరిపాలనా నిర్ణయాలు, నియామకాలు, అధికారుల వ్యవహారశైలిపై ఇప్పటికే పలు ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో తాజాగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో ఐసీటీ (ICT) డైరెక్టర్ నియామకం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ పోస్టు అవసరం ఏమిటి? ఈ పోస్టుకు ఎవరు అర్హులు? నియామకానికి ఎలాంటి విధానాన్ని అనుసరించారు? బహిరంగ నోటిఫికేషన్ ఇచ్చారా? యూనివర్సిటీ పాలకమండలి ఆమోదం తీసుకున్నారా? ప్రభుత్వ అనుమతి అవసరమైతే దాన్ని పొందారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.

నోటిఫికేషన్ లేకుండానే నియామకమా?
ఏదైనా విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ స్థాయి పోస్టును భర్తీ చేయాలంటే ముందుగా ఆ పోస్టు స్వరూపం, విధులు, అవసరమైన విద్యార్హతలు, అనుభవం, నియామక విధానం, వేతన స్థాయి వంటి అంశాలు సంబంధిత నిబంధనల ప్రకారం నిర్ణయించాల్సి ఉంటుంది. పోస్టు స్వభావాన్ని బట్టి బహిరంగ నోటిఫికేషన్, ఎంపిక కమిటీ, పాలకమండలి ఆమోదం లేదా ఇతర అధికారిక అనుమతులు అవసరమవుతాయి. అయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో ఐసీటీ డైరెక్టర్ నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందా? అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారా? ఎంపిక ప్రక్రియ జరిగిందా? లేక నేరుగా ఒక వ్యక్తికి బాధ్యతలు అప్పగించారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. నోటిఫికేషన్ లేకుండా నియామకం జరిగిందనే ఆరోపణలు నిజమైతే, దానికి వర్తించే యూనివర్సిటీ నిబంధనలు ఏమిటి? ఏ అధికార పరిధిలో ఆ నిర్ణయం తీసుకున్నారు? ఇతర అర్హులైన అభ్యర్థులకు అవకాశం ఎందుకు కల్పించలేదు? అన్న ప్రశ్నలకు యూనివర్సిటీ అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
స్నేహబంధానికి ప్రాధాన్యమిచ్చారా?
ఐసీటీ డైరెక్టర్ నియామకం వెనుక వ్యక్తిగత పరిచయాలు, స్నేహసంబంధాలు ప్రభావం చూపాయనే ప్రచారం యూనివర్సిటీ వర్గాల్లో వినిపిస్తున్నట్లు సమాచారం. సంబంధిత వ్యక్తులకు గతంలో వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

నెలకు సుమారు రూ.1.50 లక్షల వేతనం.. అదనపు సౌకర్యాల మాటేమిటి?
ఐసీటీ డైరెక్టర్‌కు నెలకు సుమారు రూ.1.50 లక్షల వేతనం చెల్లిస్తున్నారనే ప్రచారం కూడా యూనివర్సిటీ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. దీనికి అదనంగా కారు, డ్రైవర్ ఇతర సౌకర్యాలు లేదా వసతులు కేటాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వేతనం, కారు, డ్రైవర్ కేటాయింపు, ఇతర ప్రయోజనాల వివరాలను అధికారిక రికార్డుల ద్వారా ధృవీకరించాల్సి ఉంది. వేతనం ఏ ఉత్తర్వుల ఆధారంగా నిర్ణయించారు? ఆ మొత్తం స్థిర వేతనమా, కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్‌నా, లేక ఇతర భత్యాలతో కూడిన మొత్తమా? వేతనాన్ని చెల్లించేందుకు ఆర్థిక ఆమోదం ఉందా? కారు , డ్రైవర్ కేటాయింపునకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఉన్నాయా? ఇంధనం, నిర్వహణ ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? ఈ నియామకం వల్ల డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్‌పై ఎంత అదనపు ఆర్థిక భారం పడుతోంది? కానీ నాగార్జున యూనివర్సిటీలో ఫ్రెండ్ అయితే చాలు ఇలాంటి పోస్టులు పుట్టుకొస్తాయని కొంతమంది చెప్పుకుంటున్నారు. అన్ని వివరాలను యూనివర్సిటీ వెల్లడించాలని వివిధ యూనియన్ నాయకులు మరియు విద్యార్థి సంఘాలు కోరుతున్నారు.

ఇన్‌చార్జి వీసీ అధికార పరిధిపై ప్రశ్నలు…
యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్‌చాన్సలర్‌కు, ప్రతి నియామకానికి తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి అవసరమని కూడా సంబంధిత అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఈ నియామకానికి సంబంధించిన బహిరంగ నోటిఫికేషన్, అధికార ప్రతినిధి ఉత్తర్వులు, బాధ్యతల అప్పగింత, పోస్టు సృష్టింపు ఆమోదం, పాలకమండలి తీర్మానం, అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అన్నది స్పష్టంగా తేల్చాలి. నిర్ణయం తీసుకున్న అధికారి తన అధికార పరిధిలోనే వ్యవహరించారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాలి. అధికార పరిధిని మించి నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక విచారణలో తేలితే, బాధ్యత వహించాల్సిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

పాలకమండలికి తెలియకుండా నిర్ణయం తీసుకున్నారా?
గత రెండేళ్ల నియామకాలపై సమీక్ష ఎప్పుడు? ఐసీటీ డైరెక్టర్ పోస్టుపై అధికారుల వివరణ ఏది?
విశ్వవిద్యాలయంలో పరిపాలనా నిర్ణయాలు, నియామకాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఐసీటీ డైరెక్టర్ పోస్టు నియామకానికి సంబంధించిన అనుమతులు, పాలకమండలి ఆమోదంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోస్టుకు ఆమోదం తీసుకున్నారా? సంబంధిత తీర్మానం ఎప్పుడు చేశారు? సమావేశపు అజెండాలో ఈ అంశాన్ని చేర్చారా? మినిట్స్‌లో నమోదు చేశారా? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలి.
విశ్వవిద్యాలయంలో గత రెండేళ్లుగా బహిరంగ నోటిఫికేషన్లు, జరిగిన నియామకాలు, పదోన్నతులు, కీలక పోస్టుల భర్తీపై సమగ్ర సమీక్ష జరగాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ప్రతి నియామకానికి సంబంధించిన అనుమతులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, నిబంధనల అమలును పరిశీలిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కొంతమంది నాయకులు చెబుతున్నారు.

ఇప్పటికైనా పాలకమండలి స్పందిస్తుందా?
గత రెండేళ్లలో తీసుకున్న కీలక నిర్ణయాలపై పాలకమండలి సమీక్ష నిర్వహిస్తుందా? ఐసీటీ డైరెక్టర్ పోస్టు వ్యవహారానికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తుందా? నియామకాల్లో ఏవైనా అవకతవకలు జరిగాయని ఆధారాలతో తేలితే బాధ్యులపై చర్యలకు ముందుకొస్తుందా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
అధికారులు స్పందించాలి.. విచారణకు సిద్ధమా?
ఈ వ్యవహారంపై యూనివర్సిటీ అధికారులు మౌనం వీడాలని విద్యా వర్గాల్లో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఐసీటీ డైరెక్టర్ నియామకం సక్రమమైన ప్రక్రియలో జరిగి ఉంటే, దానికి సంబంధించిన ఉత్తర్వులు, అర్హతల ప్రమాణాలు, వేతన వివరాలు, అనుమతుల పత్రాలను వెల్లడించాలని కొంతమంది ప్రొఫెసర్లు కోరుకుంటున్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధికారులు ఈ వ్యవహారంపై ఎప్పుడు స్పందిస్తారు? నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేస్తారా? లేక సమాధానాలు లేని ప్రశ్నలు అలాగే మిగిలిపోతాయా? అన్నది వేచి చూడాలి.