Flash News

WhatsApp Image 2026-11-05 at 9.58.09 PM చెన్నై వివాహ వేడుకలో వైఎస్ జగన్ దంపతులు.. శ్రేయ–ఉజ్వల్‌లకు ఆశీర్వాదం

WhatsApp Image 2026-11-05 at 9.20.25 PM తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. ఏపీలోనే విచారణ

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

బ్రాహ్మణ ఉద్యోగి మృతిపై ప్రశ్నలు!రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలి: శ్రీధర్ శర్మ

0
WhatsApp Image 2026-10-28 at 6.29.19 PM

రిపోర్టర్ – వంశీకృష్ణ పాలడుగు

అమరావతి: బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ గుర్తి శ్రీనివాస శర్మ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు.

విచారణ పేరుతో శ్రీనివాస శర్మపై ఒత్తిడి తెచ్చి, బలవంతంగా పత్రాలపై సంతకాలు చేయించారన్న ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. చించినాడ గోదావరి వంతెన వద్ద జరిగిన ఘటనలో అసలు ఏం జరిగిందో నిష్పాక్షిక దర్యాప్తు ద్వారా తేల్చాలని కోరారు. ఇది ఆత్మహత్యా, మరేదైనా కారణం ఉందా అనే విషయాన్ని ఆధారాలతో నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు.

శ్రీనివాస శర్మ పేరుతో ప్రచారంలో ఉన్న సూసైడ్ నోట్‌లో పేర్కొన్న అంశాలను పరిశీలించి, అందులో ప్రస్తావించిన వ్యక్తుల పాత్రపై చట్టప్రకారం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే బాధిత కుటుంబానికి ఐదు కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. సొసైటీ ఆర్థిక లావాదేవీలు, ఆడిట్, అధికారుల నియామకాలపైనా సమగ్ర పరిశీలన జరగాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే న్యాయపోరాటాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

#SrinivasaSharma #BrahminWelfareCorporation #SridharSharma #AndhraPradeshNews #JudicialInquiry #AmaravatiNews #TeluguNews #GEETVNews

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply