Flash News

WhatsApp Image 2026-11-05 at 9.20.25 PM తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. ఏపీలోనే విచారణ

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

vlcsnap-2026-11-05-16h13m45s448 పెద్దకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను

ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

0
WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM

కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌ తీవ్ర విమర్శలు..

అధికార దుర్వినియోగం, రిగ్గింగ్‌ ఆరోపణలు..

ఎన్నికల సంస్కరణలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి

Parasuram Pachava | Bureau Chief | GEETV

GEETV, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇవి నిజమైన ఎన్నికలా? లేక ముందుగానే ఫలితాలు నిర్ణయించిన సెలెక్షన్లా? అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల సూత్రాలను పూర్తిగా పక్కనపెట్టి ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేశారని ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.

శకుని మాయాపాచికల తరహాలో అధికార దుర్వినియోగం, రౌడీయిజంతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారని జగన్ ఆరోపించారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌, 143 హామీల పేరుతో ఇంటింటికీ వెళ్లి బాండ్లు ఇచ్చిన చంద్రబాబు.. వాటిని అమలు చేయకపోవడంతో ప్రజలను ఎదుర్కొనే ధైర్యం లేక ఎన్నికలనే హైజాక్‌ చేశారని విమర్శించారు.

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన వెంటనే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను బైండోవర్‌ పేరుతో పోలీస్‌ స్టేషన్లకు పిలిపించి బెదిరింపులు, అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీకి చెందిన వ్యక్తులతో పోలీసులు కుమ్మక్కై వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని అన్నారు. నామినేషన్ల పరిశీలన సమయంలో రిటర్నింగ్‌ అధికారులు పత్రాలను మాయం చేయడం, సంతకాలను ఫోర్జరీ చేయడం, నామినేషన్లను అక్రమంగా తిరస్కరించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.

పోటీ నుంచి తప్పుకోవాలని అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి బలవంతపు ఉపసంహరణలు చేయించారని జగన్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి నుంచి కలెక్టర్లు, డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, రిటర్నింగ్‌ అధికారుల వరకు ఒక మాఫియా ముఠాలా వ్యవహరించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యవస్థకు రిఫరీగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయలేదని, మరో 22 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్‌ దశలోనే పోటీ లేకుండా చేశారని జగన్‌ పేర్కొన్నారు. పులివెందులలోని 40 వార్డులకు గాను కేవలం 20 వార్డుల్లోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయగలిగారని, మిగిలిన వార్డుల్లో పోటీకి అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు.

ఎన్నికల పోలింగ్‌ రోజున కూడా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌లలో కూర్చోనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో జరిగే ప్రక్రియను అసలు ఎన్నికలు అని పిలవగలమా? అంటూ ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఈ ఎన్నికల పరిణామాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణల అవసరాన్ని చర్చకు తీసుకురావాల్సిన పరిస్థితిని కల్పించాయని జగన్‌ అన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు వ్యవస్థల్లో మార్పులు అవసరమని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు దేశానికి ఒక కేస్‌ స్టడీగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు.

#YSJagan #YSJaganMohanReddy #YSRCP #APPolitics #AndhraPradesh #ChandrababuNaidu #TDP #MPTCElections #ZPTCElections #ElectionAllegations #ElectionReforms #Pulivendula #GEETVNews

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply