Flash News

WhatsApp Image 2026-11-05 at 9.58.09 PM చెన్నై వివాహ వేడుకలో వైఎస్ జగన్ దంపతులు.. శ్రేయ–ఉజ్వల్‌లకు ఆశీర్వాదం

WhatsApp Image 2026-11-05 at 9.20.25 PM తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. ఏపీలోనే విచారణ

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

గుంటూరు అభివృద్ధికి మార్వాడి, జైన్‌ సంఘాల సహకారం కీలకం: కేంద్ర మంత్రి పెమ్మసాని

0
WhatsApp Image 2026-10-25 at 4.51.36 PM

డా. పచ్చవ గౌతమి
జీటీవి సీఈఓ

గుంటూరు: నగర అభివృద్ధిలో వ్యాపార వర్గాల భాగస్వామ్యం కీలకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి చెందినప్పుడే ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గుంటూరు నగరానికి చెందిన మార్వాడి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కన్వెన్షన్‌ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం బలపరిచిన మేయర్‌ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో కలిసి సమావేశానికి హాజరయ్యారు. మార్వాడి, జైన్‌ సోదరులు తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ స్ఫూర్తిని సమాజానికి అందించడం అభినందనీయమని పెమ్మసాని అన్నారు. వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక సేవలోనూ ఈ వర్గాలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతోందని పెమ్మసాని తెలిపారు. మొబైల్‌ తయారీ రంగం విస్తరణ, విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుదలతో పాటు విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అన్నారు. ఆదాయపు పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం కల్పించిన రాయితీలను కూడా ఆయన ప్రస్తావించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.

గుంటూరు నగర అభివృద్ధి పనుల గురించి ప్రస్తావిస్తూ.. సుమారు రూ.600 కోట్లతో ఏడు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు (ఆర్‌ఓబీలు), రూ.571 కోట్లతో అమృత్‌ భారత్‌ 2.0 పథకం ద్వారా తాగునీటి సదుపాయాలు, రూ.400 కోట్లతో రహదారులు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పెమ్మసాని వివరించారు. శంకర్‌ విలాస్‌ వంతెన నిర్మాణం విషయంలోనూ వెనుకడుగు వేయబోమని ఆయన అన్నారు. నిర్మాణ పనులను పూర్తి చేయడానికి అవసరమైన బాధ్యత తీసుకుంటానని, అవసరమైతే తన సొంత నిధులతోనైనా నష్టపరిహారం అందించి పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. వివాదాలకు దూరంగా ఉంటూ అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకునే మార్వాడి, జైన్‌ సంఘాల మనోభావాలను గౌరవిస్తామని చెప్పారు.

నగర అభివృద్ధికి సహకరించండి: లక్ష్మీ అపర్ణ

గుంటూరు నగర అభివృద్ధిలో మార్వాడి సంఘ సభ్యుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని మేయర్‌ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ అన్నారు. మార్వాడి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోసేవ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను ఆమె అభినందించారు.నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తానని పేర్కొంటూ, ఎన్నికల్లో తమకు భారీ మెజారిటీతో మద్దతు ఇవ్వాలని సంఘ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ కోవెలమూడి (రవీంద్ర) నాని, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు తిరుపతిరావు, టీడీపీ నాయకుడు ఉగ్గిరాల సీతారామయ్య, మాజీ కార్పొరేటర్‌ ఈరంటి వరప్రసాద్‌ (బాబు), జుగ్‌ రాజ్‌ జైన్‌ భండారి, వినోద్‌ జైన్‌, రాజేంద్ర జైన్‌ తదితరులు పాల్గొన్నారు.

#GunturNews #PemmasaniChandrasekhar #LakshmiAparna #GunturDevelopment #ShankarVilasBridge #MarwariAssociation #GEETV

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply