Flash News

WhatsApp Image 2026-11-05 at 10.31.05 PM తమిళనాడు మత్స్యకారుల మృతదేహాల పరిశీలన.. ఒంగోలుకు చేరుకున్న మంత్రి మేరీ విల్సన్!

APP బ్యాలెట్ బాక్స్ కిందకు దించడంపై రగడ | వెంగళాయపాలెంలో వైసీపీ ఆందోళన

WhatsApp Image 2026-11-05 at 9.58.09 PM చెన్నై వివాహ వేడుకలో వైఎస్ జగన్ దంపతులు.. శ్రేయ–ఉజ్వల్‌లకు ఆశీర్వాదం

WhatsApp Image 2026-11-05 at 9.20.25 PM తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. ఏపీలోనే విచారణ

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

పమిడిముక్కల జెడ్పీటీసీ అభ్యర్థిగా తాతినేని ప్రవళి.. భారీ ర్యాలీతో నామినేషన్

0
nannapaneni

పామర్రు: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పమిడిముక్కల మండల తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి తాతినేని ప్రవళి నామినేషన్ కార్యక్రమం పార్టీ శ్రేణుల సందడి మధ్య ఉత్సాహంగా సాగింది. నామినేషన్ సందర్భంగా కపిలేశ్వరపురం నుంచి మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చారు.

ర్యాలీలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తాతినేని ప్రవళికి మద్దతు తెలిపారు. పార్టీ జెండాలు, నినాదాలతో ఎన్నికల వాతావరణం సందడిగా మారింది. నామినేషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పమిడిముక్కల మండలంలో రాజకీయ సందడి నెలకొంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలమే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి, విజయానికి కార్యకర్తల కృషి ఎంతో కీలకమని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు, సముచిత స్థానం లభిస్తాయని అన్నారు.

టీడీపీ నాయకుడు తాతినేని వీరబ్రహ్మం సోదరుడు తాతినేని రమేష్ కుమార్తె తాతినేని ప్రవళిని, పార్టీ శ్రేణుల అభీష్టం మేరకు పమిడిముక్కల మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని వర్ల కుమార్ రాజా పిలుపునిచ్చారు. పామర్రు నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు.

#TDP #TatinenIPravalli #Pamarru #VarlaKumarRaja #ZPTCElections #APLocalBodyElections #KrishnaDistrict #Machilipatnam #TDPNews #AndhraPradesh #TeluguNews #PoliticalNews #GEETV

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply