క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..
నక్కపల్లి: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత చాటిచెప్పారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమె.. మంత్రి హోదాను పక్కనపెట్టి సాధారణ ఓటరుగా ఇతరులతో పాటు క్యూలైన్లో నిలబడ్డారు. తన వంతు వచ్చే వరకు వేచి ఉండి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి అనిత ప్రజలకు చక్కని సందేశం ఇచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో హోదాలు, స్థాయిలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు సమానమని ఆమె ఆచరణలో చూపించారు. ఒక్క ఓటు కూడా ఎంతో విలువైనదని, ప్రజల భవిష్యత్తును నిర్ణయించడంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
#VangalapudiAnitha #HomeMinister #Anitha #Nakkapalli #Anakapalli #Voting #VoteYourRight #Democracy #APNews #GEETVNews