బ్యాలెట్ బాక్స్ కిందకు దించడంపై రగడ | వెంగళాయపాలెంలో వైసీపీ ఆందోళన
CH.Veeranjaneyulu | Reporter | GEETV
GEETV, గుంటూరు: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎన్నికల సిబ్బంది సీల్ వేసిన బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్న సమయంలో ఓ బ్యాలెట్ బాక్సును మార్గమధ్యలో కిందకు దించడంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
సీల్ వేసిన బ్యాలెట్ బాక్సును మధ్యలో ఎందుకు కిందకు దించాల్సి వచ్చిందని వైసీపీ శ్రేణులు ప్రశ్నించాయి. ఎన్నికల సామగ్రి తరలింపులో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. ఈ ఘటనపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసులు, ఎన్నికల సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన ఎలా జరిగిందని వైసీపీ నాయకులు ప్రశ్నించారు. బ్యాలెట్ బాక్సుల తరలింపులో పూర్తి పారదర్శకత ఉండాలని, ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి అనుమానాలకు తావివ్వకూడదని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నల్లపాడు సీఐపై కూడా వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. సీఐ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల లేదా సంబంధిత అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.
#YSJagan #YSBharathi #Chennai #WeddingCelebration #JosephVijay #GautamAdani #KTR #YSVijayamma #GEETVNews